Monday, September 1, 2014

గణపతి హోమము


    


విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం,  వివాహం ఇలా ఏవిషయంలోనైనా తలచిన పనులలో తరచూ ఆటంకాలు వస్తుంటే ఈ "గణపతి హోమాన్ని" నిర్వహించి ఆయా సమస్యలనుండి బయటపడవచ్చు. గణపతి అనుగ్రహంతోపాటు లక్ష్మీ కటాక్షంకూడా కావాలనుకున్న వారు "లక్ష్మీ గణపతి హోమాన్ని" చేస్తారు. 
 మండపారాధన చేసి ఆదిత్యాది నవగ్రహ, అష్టదిక్పాలక సహితంగా గణపతిని ఆవాహన చేస్తారు.







గణపతి యంత్రాన్ని లిఖించి, గణపతి మూల మంత్రాన్ని జపిస్తారు. గణపతి బిజాక్షరాలతో క్షీర తర్పణలు చేస్తారు. 


 గణపతికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు,  చెఱకు, వెలగ, కొబ్బరి, అరటి,  జామపళ్లు, బెల్లము, అటుకులు, తెల్లజిల్లేడు సమిధలు, గరిక మొదలైన ద్రవ్యాలతో హోమం చేస్తారు. లక్ష్మీగణపతి హోమమైతేలక్ష్మీదేవి ప్రీతికై దాడిమీ ఫల బీజాలతోనూ,  తేనెలో ముంచిన తామరపూలతోనూ హోమం చేస్తారు.